పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం

పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం

పెద్దపల్లి, వెలుగు: పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని మొక్కుకున్న ఓ వ్యక్తి ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం( బెల్లం) సమర్పించి ఆదివారం సమ్మక్క సారలమ్మ వన దేవతలకు మొక్కు తీర్చుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ రియల్​ఎస్టేట్ ​సంస్థకు చెందిన కాసర్ల రాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క భైరవకు గత నెలలో సుస్తీ చేసింది.

ఆ సమయంలో అతనికి ఏమి తోచక కుక్క ఆరోగ్యం కుదుట పడితే జాతర సమయంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తానని సమ్మక్క, సారలమ్మకు మొక్కుకున్నాడు. మొక్కిన రెండు రోజులకే భైరవకు ఆరోగ్యం కుదుటపడింది. మొక్కు నెరవేరింది కాబట్టే కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించానని కాసర్ల రాజు తెలిపారు.