
- నివాళుర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- పలు బాధిత కుటుంబాలకు పరామర్శ
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: సీనియర్ క్రికెటర్బింగి దుర్గాప్రసాద్ అకాల మరణం క్రికెట్‌కు తీరని లోటని, మంచి క్రికెటర్‌ను కోల్పోయామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్, బెల్లంపల్లి పట్టణాల్లో ఎంపీ పర్యటించారు. ఇటీవల చనిపోయిన పలువురు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. రామకృష్ణాపూర్పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్బింగి శివకిరణ్ సొదరుడు సీనియర్ క్రికెటర్, కోచ్దుర్గాప్రసాద్ ఇటీవల గుండెపోటుతో చనిపోగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
కోల్‌బెల్ట్ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దుర్గాప్రసాద్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్మాజీ ప్రజాప్రతినిధులు పూల్లూరి కల్యాణ్, సుధాకర్ సోదరుల తల్లి భీమక్క, కాంగ్రెస్ లీడర్కట్ల రమేశ్తల్లి లక్ష్మి, బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లుమత్తమారి శ్రీనివాస్ అత్త దాసరి అనసూర్యవతి, కన్నూరి వెంకటేశ్ తండ్రి ఓదెలు ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట స్థానిక లీడర్లు రఘునాథ్ రెడ్డి, మత్తమారి సూరిబాబు, మునిమంద రమేశ్, గెల్లి జయరాజ్, పోలం సత్యనారాయణ, ఎ.రాజేశ్, ప్రేమ్‌సాగర్, రాజలింగు, సతీశ్, లక్ష్మణ్, రమేశ్, రాజనర్సు, బాలరాం, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.