కాకా ఫ్యామిలీని విమర్శిస్తే ఊరుకోం: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​ నేతలు

కాకా ఫ్యామిలీని విమర్శిస్తే ఊరుకోం: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​ నేతలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి... పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ను విమర్శిస్తే ఊరుకోమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేశారు. కాకా కుటుంబంపై INTUCనాయకులు  కాంపెల్లి సమ్మయ్య  చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 

మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు  మల్లికార్జున్​ కోటేశ్వర్​ మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్​ ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేదని.. మాలలకు న్యాయం చేయాలని కోరారని కోటేశ్వర్​ అన్నారు. కాకా కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. 

చెన్నూరు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వందల  కోట్లు నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటే ఐఎన్టీయూసి నాయకుడు.కాంపెల్లి సమ్మయ్య కు కనిపించడం లేదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై  చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఐఎన్టీయూసీ నాయకుడు కాంపెల్లి సమ్మయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఐఎన్టీయూసీ,కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.