
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ చలో ఢిల్లీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం తమ పోరాటం ఆగబోదన్నారు. ఈ మహాధర్నాకు 50 మంది కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారని చెప్పారు. బీజేపీకి రిజర్వేషన్లు అంశంలో క్లారిటీ లేదన్నారు ఎంపీ వంశీకృష్ణ. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తూ.. తెలంగాణలో అడ్డుకుంటాం అంటున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల కోసం తమపోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
తెలంగాణ బీజేపీ నేతలకు రిజర్వేషన్లపై క్లారిటీ లేదన్నారు వంశీకృష్ణ. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అడ్డుకుంటామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణ నేతలు పార్టీ సమావేశాలు పెట్టుకుని రిజర్వేషన్ అంశాల్లో క్లారిటీ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలో బీజేపీ నాయకులు ఆలోచన చేయాలన్నారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆగస్టు 6న జంతర్‌మంతర్ దగ్గర మహా ధర్నా జరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా హాజరయ్యారు.