పెద్ది ఆటకు జాన్వీ కామెంటరీ

పెద్ది ఆటకు జాన్వీ కామెంటరీ

రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం జాన్వీ కపూర్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె అచ్చియమ్మ అనే పాత్రను పోషిస్తోంది.  ‘‘మా పెద్ది ప్రేమకు ఫైర్‌‌‌‌‌‌‌‌బ్రాండ్ ఆటిట్యూడ్...’ తన లుక్‌‌‌‌‌‌‌‌ను రివీల్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చీరకట్టులో మైక్రోఫోన్‌‌‌‌‌‌‌‌ ఎదురుగా నిలుచొని ఏదో ప్రదర్శన ఇస్తున్నట్టు కనిపించింది. 

మరో పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పీకర్లు అమర్చిన జీపులో నిలబడి, రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ  జనాలకు అభివాదం చేస్తున్నట్టు కనిపించింది. ఈ రెండు పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఈ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డ్రామాలో ఆమె స్పోర్ట్స్ కామెంటేటర్‌‌‌‌‌‌‌‌గా‌‌‌‌‌‌‌‌ నటిస్తున్నట్టు అర్థమవుతోంది.  ‘ఫియర్స్ అండ్ ఫియర్‌‌‌‌‌‌‌‌లెస్’ అనే క్యాప్షన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా మాసీ లుక్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ చేసింది జాన్వీ. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.  

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు,  దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఆస్కార్ విజేత ఎఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్. రత్నవేలు డీవోపీగా,  నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.  వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.