గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. 1980 నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అంచానాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా బుచ్చిబాబు షేర్ చేసిన అప్డేట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ముగింపు దశలో 'పెద్ది' షూటింగ్
చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఊరటనిస్తూ, షూటింగ్ సెట్స్ నుండి రామ్ చరణ్‌తో దిగిన ఫోటోను బుచ్చిబాబు పంచుకున్నారు. పెద్ది సెట్స్‌లో చివరి 6 రోజులు.. నాకెంతో స్ఫూర్తినిచ్చిన నా ప్రియమైన పెద్ది అంటూ భావోద్వేగపూరితమైన క్యాప్షన్ ఇచ్చారు. షూటింగ్ సమయంలో గాయపడిన చరణ్, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తుండటం అభిమానులకు అసలైన పండగలా మారింది.
స్పెషల్ సాంగ్ సందడి
ప్రస్తుతం జరుగుతున్న ఆఖరి షెడ్యూల్‌లో ఒక భారీ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం చివరకు సంయుక్త మీనన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస వారణాసి పేర్లు వినిపించినప్పటికీ, ఫైనల్‌గా చరణ్‌తో కలిసి సంయుక్త స్టెప్పులు వేయబోతోంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'చికిరి', 'రై రై రారా' పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచి సినిమాపై క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. ఈ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు మరో పెద్ద హైలెట్ గా నిలవనుంది.
Final 6 days on #Peddi sets 🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) April 21, 2026
My most inspiring character…
My beloved Peddi ❤️🤗@AlwaysRamCharan Sir ❤️❤️❤️ pic.twitter.com/d9SF2FR2kX
విడుదల ఎప్పుడు?
వరుస వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని జూన్ 2026లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు , రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమయానికి పూర్తయితేనే ఈ డేట్ లాక్ అవుతుంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడుతూ వస్తుండటంలో ఆటు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా.. ఫిక్స్ డేట్ ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నారు.
►ALSO READ | కట్టప్ప కుటుంబంలో ఆసక్తికర పరిణామం.. తండ్రీకూతురిది ఒకదారి .. కొడుకుది మరోదారి..!
రికార్డులపై ధీమా..
ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. సంగీతం - ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. - మైత్రీ మూవీ మేకర్స్ & వృద్ధి సినిమాస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటెంట్ , టేకింగ్ పరంగా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తన కెరీర్‌లోనే బెస్ట్ వర్క్‌గా మలుస్తున్నారని, రామ్ చరణ్ హార్డ్ వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను మరోసారి 80ల నాటి గ్రామీణ వాతావరణంలోకి తీసుకెళ్లడానికి 'పెద్ది' సిద్ధమవుతున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .

