రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్దమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు ఓవర్సీస్ ప్రింట్స్తో పాటు విడుదలకు సంబంధించిన కీలక పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే, రామ్ చరణ్-జాన్వీలతో పాటుగా కన్నడ శివన్న, జగపతి బాబు వరుస ప్రమోషన్స్‌తో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. దీంతో జూన్ 4న థియేటర్లు స్టేడియంలుగా మారడం.. రికార్డుల వేట మొదలవడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, జూన్ 4 తర్వాత కలెక్ట్ చేసే వసూళ్లు ఎంతనేది ఎవ్వరం ముందే చెప్పలేం. ఎందుకంటే, పెద్ది అందుకునే టాక్ని బట్టి వసూళ్ల జాతర ఉంటుంది. కానీ విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఓటీటీ హక్కుల విషయంలో ‘పెద్ది’ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి చరణ్ రేంజ్కు ఓటీటీ రైట్స్ పలికాయా లేదా అనేది తెలుసుకుందాం.
ఓటీటీ బిజినెస్‌లో రికార్డు..
‘పెద్ది’ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ రిలీజ్ అనంతరం ‘పెద్ది’ ఓటీటీ హక్కుల విషయంలో రికార్డు బ్రేక్ చేసే బిజినెస్ జరుపుకున్నట్లు టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల ప్రకారం,
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అన్ని భాషల డిజిటల్ హక్కులను కలిపి దాదాపు రూ.130 కోట్ల బేస్ ప్రైస్‌కు నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుందని టాక్. అయితే ఇది కనీస ధర మాత్రమేనని, థియేటర్లలో సినిమా సాధించే కలెక్షన్ల ఆధారంగా అదనపు బోనస్ క్లాజులు కూడా ఈ డీల్‌లో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు, హిందీ మార్కెట్లలో ‘పెద్ది’ భారీ వసూళ్లు సాధిస్తే ఓటీటీ డీల్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఫైనల్ డీల్ వాల్యూ రూ.130 కోట్లను మించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
లెక్కలు మార్చనున్న కలెక్షన్స్ ..
‘పెద్ది’ థియేటర్లలో సాధించే వసూళ్లను బట్టి ఓటీటీ డీల్ విలువ పెరిగేలా ప్రత్యేక బోనస్ క్లాజులు చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు వెర్షన్ రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే అదనపు మొత్తం చెల్లించేలా, అలాగే హిందీ వెర్షన్ రూ.100 కోట్ల మార్క్ దాటితే ఒక స్థాయి, రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే మరో స్థాయి అదనపు చెల్లింపులు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న బేస్ డీల్ విలువ కంటే, సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనను బట్టి తుది ఓటీటీ డీల్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆడియో రైట్స్ డీల్ విలువ కూడా రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా, రామ్ చరణ్ ప్రీవియస్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా రైట్స్ రికార్డు స్థాయిలో దాదాపు రూ.160 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని ప్రచారం జరిగింది. ఇపుడు ఆ లెక్కన చూస్తే ‘పెద్ది’ బేస్ డీల్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ, వచ్చే అదనపు బోనస్ క్లాజులతో రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ‘పెద్ది’ ఓటీటీ డీల్ కూడా రామ్ చరణ్ మార్కెట్ స్థాయిని మరింత పెంచే మరో భారీ ఒప్పందంగా మారింది.
