ఆవుల అక్రమ రవాణా : పెహ్లూఖాన్‌, అతడి కొడుకులపై చార్జ్ షీట్

ఆవుల అక్రమ రవాణా : పెహ్లూఖాన్‌, అతడి కొడుకులపై చార్జ్ షీట్

అల్వార్ మూకదాడి ఘటనలో రాజస్థాన్ పోలీసులు చార్జిషీట్ దాఖలుచేశారు. 2017లో పశువులను ఓ వాహనంలో తరలిస్తున్న పెహ్లూఖాన్ అనే వ్యక్తిని గోరక్షకులు అడ్డుకున్నారు. ఇక్కడ జరిగిన గొడవలో పెహ్లూఖాన్ తీవ్రంగా గాయపడి.. 2రోజుల తర్వాత హాస్పిటల్ లో చనిపోయాడు. ఈ కేసులో రాజస్థాన్ పోలీసులు శనివారంనాడు చార్జిషీట్ దాఖలు చేశారు.

రాజస్థాన్ లోని జంతు సంరక్షణ చట్టం 1995 ప్రకారం.. పాడి పశువులను వధించడం కోసం తరలించడం నిషిధ్దం. పెహ్లూఖాన్ ఈ కారణంతోనే.. పాడి పశువులను అక్రమంగా తరలిస్తున్నాడని(స్మగ్లింగ్) … ఈ కేసులో అతడిపై అభియోగాలు నమోదుచేశారు పోలీసులు. మరణానంతరం పెహ్లూఖాన్ పై చార్జి షీట్ ఫ్రేమ్ చేశారు పోలీసులు. పెహ్లూఖాన్ తోపాటు.. అతడి కొడుకులు ఇర్సాద్(25), ఆరిఫ్(22)ల పైనా కేసులు పెట్టారు. రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టం లోని 5,8, 9 సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.