కిచ్చా సుదీప్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పహిల్వాన్ ట్రైలర్ విడుదలైంది. కన్నడతో హెబ్బులి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత… మరో సూపర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సుదీప్. పహిల్వాన్ ను భారీస్థాయిలో తెరకెక్కించి.. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. 5 భాషల్లోనూ ట్రైలర్ విడుదల చేశారు.
కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్రం అందిస్తోంది. సునీల్ షెట్టి, ఆకాంక్ష సింగ్, సుషాంత్ సింగ్, కబీర్ దుహాన్ సింగ్ నటించారు.
బలముందన్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణంతో కొట్టేవాడే యోధుడు లాంటి డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. కుస్తీ పోటీల కథాంశంతో సినిమా రూపొందింది. సెప్టెంబర్ 12న పహిల్వాన్ ను విడుదల చేయబోతున్నారు.
చిరంజీవి సైరా సినిమాలోనూ కిచ్చా సుదీప కీలక పాత్ర పోషించడంతో… పహిల్వాన్ పై ఆసక్తి పెరిగింది. రాజమౌళి ఈగ, బాహుబలితో సుదీప్ కు తెలుగులో క్రేజ్ ఏర్పడింది.
