మద్యం అమ్మకాలపై..ఉన్న శ్రద్ధ విద్యపై లేదు

మద్యం అమ్మకాలపై..ఉన్న శ్రద్ధ విద్యపై లేదు
  • పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ 

ముషీరాబాద్, వెలుగు : పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్ షిప్​లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి మద్యం అమ్మ
కాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేకపోవడం శోచనీయమని మండిపడింది. మంగళవారం గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి రాంనగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించింది. పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ ​మాట్లాడుతూ.. మద్యం టెండర్లకు 3 నెలల ముందే నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం కేసీఆర్ ఏండ్లు గడుస్తున్నా 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,

స్కాలర్ షిప్స్ బకాయిలు చెల్లింకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్ షిప్​లు విడుదల చేయాలని డిమాండ్  చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్యామ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీను, జిల్లా నేతలు గౌతం, గణేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.