పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి

పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి

హైదరాబాద్: పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల ముందు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ... విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించకుకోవడంలేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జీలను రూ. 15 వందల నుంచి 3 వేలకు పెంచాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం