అదానీ చేతికి పెన్నా సిమెంట్‌‌‌‌

అదానీ చేతికి పెన్నా సిమెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌కు చెందిన​ అంబుజా సిమెంట్స్‌‌‌‌  హైదరాబాద్ కంపెనీ  పెన్నా సిమెంట్  ఇండస్ట్రీస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (పీసీఐఎల్‌‌‌‌) ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేయనుంది.  రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని అంబుజా సిమెంట్స్‌‌‌‌ ఎక్స్చేంజింగ్ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది.  పెన్నా సిమెంట్‌‌‌‌లో 100 శాతం వాటాను  ప్రమోటర్లు  పీ ప్రతాప్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ డీల్ కోసం  ఇంటర్నల్‌‌‌‌గా ఫండ్స్ సేకరిస్తామని పేర్కొంది.   

అదానీ గ్రూప్ తన సిమెంట్ బిజినెస్ కెపాసిటీని ప్రస్తుతం ఉన్న ఏడాదికి 89 మిలియన్ టన్నుల నుంచి 2028 నాటికి ఏడాదికి 140 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. పెన్నా సిమెంట్‌‌‌‌కు ఏడాదికి 10 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంది. కంపెనీకి ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్రలలో  4 ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటికితోడు మరో రెండు ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి.