కొత్త పెన్షన్ కార్డులు అందజేసిన తలసాని

కొత్త పెన్షన్ కార్డులు అందజేసిన తలసాని

హైదరాబాద్: అర్హులైన అందరికీ కొత్త పెన్షన్ కార్డులు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట్ లోని ఆర్డీవో కార్యాలయంలో కొత్త పెన్షన్ కార్డులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్లు దాటిన 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తున్నామని.. స్వాతంత్ర దినోత్సవాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల నుంచి మరో 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 2వందలు ఉన్న పెన్షన్ ను 2వేలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో సర్కార్ దవాఖానాల రూపు రేఖలనే ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందని ఆయన వివరించారు. ప్రతి పక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి తలసాని హెచ్చరించారు.