పెన్షన్లు, రేషన్ బియ్యం కాకా కృషే : వంశీకృష్ణ

పెన్షన్లు, రేషన్ బియ్యం కాకా కృషే : వంశీకృష్ణ
  •  బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, దాడులె
  • కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతిక 

బెల్లంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సపోర్ట్ తో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. ఇవాళపెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న వంశీకృష్ణ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 

సింగరేణి సంస్థ అప్పుల్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ. 450 కోట్ల లోన్ ఇప్పించి లక్ష ఉద్యోగాలను కాపాడారని గుర్తు చేశారు.  పెన్షన్లు, రేషన్ బియ్యం కాకా కృషేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆ పార్టీ లీడర్లు భూకబ్జాలు, దందాలు, దాడులకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్​ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో భగీరథ నీళ్లు రాక ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్ధమైన సేవ చేయాలన్న సంకల్పంతోనే  ముందుకు వచ్చానని ఆయన తెలిపారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి పరిష్కారించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయిస్తానన్నారు.  అలాగే పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ గా అప్ గ్రేడ్ చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ల హాల్టింగుకు కృషి చేస్తానని ఆయన అన్నారు