గోదావరిఖని లో మెడికల్ వ్యర్థాలు బయట పడేస్తే చర్యలు : డీఎంహెచ్‌‌‌‌వో వాణిశ్రీ

గోదావరిఖని లో మెడికల్ వ్యర్థాలు బయట పడేస్తే చర్యలు :  డీఎంహెచ్‌‌‌‌వో వాణిశ్రీ

గోదావరిఖని, వెలుగు:  బయో మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్​కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణశ్రీ, డీఎంహెచ్‌‌‌‌వో వాణిశ్రీ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు హాస్పిటళ్ల నిర్వాహకులతో ఎన్టీపీసీ మిలీనియం హాల్‌‌‌‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాడిన సిరంజీలు,  ప్లాస్టర్, దూది తదితర ప్రమాదకర వ్యర్థాలను సాధారణ చెత్తలో పడవేస్తే, చెత్త తొలగించేటప్పుడు మున్సిపల్ సిబ్బందికి హాని జరిగే అవకాశం ఉందన్నారు.

 ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే హాస్పిటల్‌‌‌‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పని చేస్తున్న వెంకట రమణ ఇన్సినరేటర్స్ ఏజెన్సీ నిర్వాహకులకు అందజేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే హాస్పిటల్ల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఆర్‌‌‌‌‌‌‌‌ఎంవో కృపాబాయి, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస్​, డాక్టర్లు  పాల్గొన్నారు.