చలితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

చలితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

సంగారెడ్డి, వెలుగు :  చలికాలం వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పొగమంచుకు పొల్యూషన్​తోడైంది. ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉదయం 8 గంటలైనా మంచు తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి ప్రజలపై మంచు దుప్పటి కప్పేస్తోంది. చలికాలంలో పరిమితి వేగం ముఖ్యమని వాహనదారులను పోలీసు శాఖ, పొల్యూషన్ నియంత్రణ మండలి హెచ్చరిస్తున్నా పొల్యూషన్ కట్టడి  కోసం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాణాలులు పోతున్నయ్...  
పొగమంచు.. పొల్యూషన్​ కారణంగా జిల్లాలో మూడు రోజుల్లో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిశాయి. చౌటకూర్‌ మండలం తాడ్‌ దాన్‌పల్లి చౌరస్తా వద్ద బుధవారం ఉదయం 7 గంటల టైంలో వ్యాన్, ఆటో ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు.అందోల్ మండలం కన్సన్ పల్లి నాందేడ్‌- అకొలా నేషనల్ హైవేపై గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  ప్రాణాలు కోల్పోయారు. 

పొల్యూషన్ నియంత్రణకు చర్యలు
పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. వాతావరణ మార్పులను ముందుగానే గుర్తించి పొల్యూషన్ విడుదల చేసే ఫ్యాక్టరీలకు
నోటీసులు ఇచ్చాం.
- గీత సఫారీ, పీసీబీ అధికారి

వాహనాలు స్లోగా నడపాలి.. 
చలికాలం పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. మంచులో వాహనాలు స్లోగా నడపాలి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. హెడ్ లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. 
– రమణ కుమార్, జిల్లా ఎస్పీ