బంగ్లాదేశ్, పాకిస్థాన్నుంచి వచ్చినోళ్లు ఎకరాలు కబ్జా చేస్తున్రు: ఎంపీ రఘునందన్ రావు

బంగ్లాదేశ్, పాకిస్థాన్నుంచి వచ్చినోళ్లు ఎకరాలు కబ్జా చేస్తున్రు: ఎంపీ రఘునందన్ రావు

చేవెళ్ల, వెలుగు: రోహింగ్యాల పేరుతో హైదరాబాద్‎కు వచ్చినోళ్లు భూములు కబ్జా చేస్తుంటే కాంగ్రెస్​ ప్రభుత్వం వారిని కాపాడుతోందని మెదక్​ఎంపీ రఘునందన్​రావు ఆరోపించారు. పేద హిందువుల ఇండ్లను మాత్రం హైడ్రా కనికరం లేకుండా కూల్చేస్తుందని మండిపడ్డారు. చేవెళ్లలో ఓ పెట్రోల్​బంక్​ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 

రోహింగ్యాల పేరుతో బంగ్లాదేశ్, పాకిస్థాన్​ నుంచి వచ్చిన ముస్లింలు మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, బండ్లగూడలో విస్తరించారని, ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తుంటే వ్యవస్థలన్నీ ఏకపక్షంగా వాళ్లకు సపోర్టు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం నాయకులు కట్టిన కాలేజీ కూల్చమంటే పేదలకు చదువు చెప్తున్నారని హైడ్రా చీఫ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. వాళ్లు పేదోళ్లకు చదువు చెప్పడం లేదని, డొనేషన్లు వసూలు చేస్తున్నారని అన్నారు. రోహింగ్యాలపై మాట్లాడితే ముస్లిం ఓట్లు పోతాయన్న భయం కాంగ్రెస్‎లో ఉందన్నారు.