టమాటాల కోసం భారీ క్యూ.. అందరూ డబ్బున్నోళ్లే..

టమాటాల కోసం భారీ క్యూ.. అందరూ డబ్బున్నోళ్లే..

టమాటా ధరల్ని చూసి బెంబేలెత్తిపోతున్న ఈ రోజుల్లో.. వాటి కొరతతో సంపన్నులు సైతం రోడ్లపైకి వస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రం ఘజియాబాద్​లోని ఓ సొసైటీ కాంపౌండ్​లో ఓ టెంపో టమాటల లోడ్​తో వచ్చింది. 

సమాచారం అందుకున్న గేటెడ్​ వాసులు బుట్టలు, సంచులతో కిందకు దిగారు. వారంతా క్యూలో నిల్చొని టమాటోలను కొనుగోలు చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు వీడియో తీశారు. ఇది కాస్తా వైరల్​గా మారడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 

సంపన్నులను సైతం క్యూలో నిలబెట్టిన టమాటా నువ్​ సూపర్​ అంటూ ఒకరు.. వాళ్లంటే ఉన్నోళ్లు బ్రో.. ఎంతైనా ఇచ్చి కొనుగోలు చేస్తారు.. సామాన్యుల పరిస్థితి ఏంటి అని మరొకరు... ఇలా వారికి నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

టమాటాలు ఎక్కువగా పండే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అకాల వర్షాలు పంట దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఎగుమతి, కొనుగోళ్లలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడి టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. ఘజియాబాద్​ మార్కెట్లో కిలో టమాటా రూ.200లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.