5100 బస్సులకు ప్రైవేటు రూట్లలో పర్మిట్ : కేసీఆర్

5100 బస్సులకు ప్రైవేటు రూట్లలో పర్మిట్ : కేసీఆర్

హైదరాబాద్ : ఆర్టీసీ ఎజెండాగా శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం..సంచలన కామెంట్స్ చేశారు. 5100 ప్రైవేటు రూట్లలో బస్సులకు పర్మిట్ ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ నెగెటీవ్ లో లేదన్నారు కేసీఆర్. వందశాతం ఏం నిర్ణయం తీసుకున్న ప్రజల మేలుతోటే చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అంతులేని కోరికలతో సమ్మెకు వెళ్లారని.. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని ఇవాళ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం.

ఎక్సైజ్ కొత్త పాలసీతో 900 కోట్లు ఆధాయం వచ్చిందని.. రాష్ట్ర వృద్ధిరేటు 21 నుంచి 5 శాతానికి తగ్గిందని తెలిపారు. తెలంగాణ ప్రజలను అమితంగా ప్రేమిస్తాననన ఆయన.. అన్ని వర్గాల శ్రేయస్సుతో పని చేస్తామని చెప్పారు. ప్రతిసారి ప్రజలు మంచి మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం చావు చివరిదాక వెళ్లొచ్చానని చరిత్ర తనకుందని తెలిపారు.