
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 1,982 సర్కారు స్కూళ్లకు డే అండ్ నైట్ వాచ్ మన్లను నియమించుకునేందుకు విద్యా శాఖ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. స్కూళ్లు రీఓపెన్ అయ్యే వరకే వారి సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవ సేన ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున వేతనం ఇవ్వాలని సూ చించారు. మనఊరు మనబడి కార్య క్రమం ద్వారా పనులు పూర్తయిన బడులకే నైట్ వాచ్మన్లను నియమించుకునే చాన్స్ ఇస్తున్నట్లు వివ రించారు. స్టేట్లో 535 ప్రైమరీ స్కూళ్లు, 93 యూపీఎస్, 1354 హైస్కూళ్లలో వీరిని అపాయింట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 155, రంగా రెడ్డిలో 151 మందిని, అత్యల్పంగా వరంగల్, జోగుళాంబ గద్వాలలో 11 మంది చొప్పున వాచ్మన్లను నియమించనున్నట్లు చెప్పారు.