
పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర చంద్రవరం యాత్రని వైసీపీ నేత పేర్నినాని విమర్శించారు. ఇది చంద్రబాబు యాత్రని ఆయన అన్నారు. అన్నవరం, భీమవరం యాత్ర కాదన్నారు. అధికారం ఉన్నా, లేకపోయినా జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.పవన్ కళ్యాణ్ బందరు వస్తే మంచిదని పేర్నినాని సూచించారు. ఆయనకు సినిమా షూటింగులు లేక వారాహి యాత్రను ప్రారంభించారని అన్నారు. ఇంకా వారాహి యాత్ర ప్రారంభం కాలేదా అంటూ సెటైర్లు వేశారు. గోదావరి జిల్లాల్లో తిరగమని పవన్కు చంద్రబాబు సూచించారని అందుకే అక్కడే వారాహి యాత్ర చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.