
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో అగ్గి రాజుకుంటోంది. పరోక్షంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నాయకుల్లో చర్చకు దారి తీస్తోంది. హరీష్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే, ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రులు తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని.. కౌంటర్ ఇచ్చారు. హరీష్ ఏమన్నాడో తెలుసుకోకుండా.. పవన్ ఏపీ మంత్రులను తప్పుబట్టడం సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్ కు బీఆర్‌ఎస్ పై, తెలంగాణ పై ఎందుకంత ప్రేమ వచ్చిందో తనకు అర్థం అవ్వట్లేదని అన్న పేర్ని నాని.. తెలంగాణ మంత్రుల్ని విమర్శిస్తుంటే పవన్‌కు వచ్చిన బాధ ఏంటో చెప్పాలన్నారు. పవన్ తెలంగాణ మంత్రులపై ఈగ వాలనివ్వడం లేదు. గతంలో తెలంగాణ మంత్రులపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పేర్ని నాని మీడియా ముందు ప్రదర్శించారు.
సొంత రాష్ట్రంపై ప్రేమ లేని పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఏపీని అవమానిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా అని ప్రశ్రించారు. కన్న తల్లి లాంటి రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోంవాలని ఆవేదన వ్యక్తం చేశారు.