గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని బూరెడ్డిపల్లి గేటు వద్ద ఏడు కిలోల ఎండు గంజాయి పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఆకాష్ పటేల్ ను జడ్చర్ల ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆకాష్ పటేల్ కొంతకాలంగా బాలానగర్ మండలంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

అతడు బీహార్ రాష్ట్రంలో కిలో రూ. 20 వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి, వంద గ్రాముల చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ. 300కు స్థానిక కంపెనీ కార్మికులకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ స్పెషల్ పార్టీ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 40 వేల విలువైన గంజాయితో పాటు ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.