రోడ్డెక్కినందుకు ఆపిన పోలీసులు.. స్పాట్ లోనే చనిపోయిన యువకుడు

రోడ్డెక్కినందుకు ఆపిన పోలీసులు.. స్పాట్ లోనే చనిపోయిన యువకుడు

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం విధించిన లాక్డౌన్ ను ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. నేటి నుంచి ఏ మండలానికి చెందిన పోలీసులు అదే మండలంలో విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. లాక్డౌన్ పట్ల పోలీసుల తీరుతో ఒక యువకుడు ప్రాణాలొదిలాడు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గౌస్ పాషా అనే 35 ఏళ్ల యువకుడు గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. అతడు ప్రతిరోజూ మెడిసిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే గౌస్ పాషా తన మందులు అయిపోవడంతో తెచ్చుకోవడం కోసం బయటకు వచ్చాడు. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. పాషాను అడ్డగించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్డు మీదకు ఎందుకొచ్చావని కొట్టారు. దాంతో పాషా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే పాషాను ఆస్పత్రికి తరలించారు. కానీ.. మార్గమధ్యలోనే పాషా మృతిచెందాడు. దాంతో సత్తెనపల్లిలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పాషాను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పాషా మృతదేహంతో అతని బంధువులు భారీగా పోలీస్ స్టేషన్ ముందు దర్నాకు దిగారు. పాషా బందువులను ఆపే క్రమంలో సీఐ ను కూడా వారు కొట్టారు.

అయితే పోలీసులు మాత్రం తాము పాషాను కొట్టలేదని అంటున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్డు మీదకు ఎందుకొచ్చావని అడగడంతో.. భయపడి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. లాక్డౌన్ లో పోలీసుల తీరు పట్ల స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనకు కారణమైన సత్తెనపల్లి ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఉన్నతాధికారులతో ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు ఐజీ తెలిపారు.

For More News..

కరోనా టెస్టుల్లో ఏపీ రికార్డ్

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు