జాబ్ పోతుందనే భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య

జాబ్ పోతుందనే భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య

జాబ్ పోతుందనే భయంతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. కరోనా వల్ల చాలామంది తమ ఉపాధి కోల్పోయారు. కంపెనీలు ఉద్యోగులను లాక్డౌన్ సాకుతో తొలగించాయి. ఇలా చాలామంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు.

అయితే ధన్వాడ్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం కరోనా మహమ్మారి వల్ల ఉపాధి పోతుందేమోననే భయంతో తన భార్య, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ గ‌డ‌గ్ జిల్లా రోనా తాలూకాలోని అసూటీ గ్రామానికి చెందిన మౌనేష్ ప‌టారా (36),  అర్పిత (28) భార్యాభర్తలు. వీరికి శుక్రిత అనే నాలుగేళ్ల పాప ఉంది. వీరు ఉపాధి కోసం ధ‌న్వాడ్ లో నివాసముంటున్నారు. మౌనేష్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అర్పిత అనారోగ్యానికి గురైంది. ఆ తర్వాత పాప కూడా జ్వరం బారినపడింది. దాంతో వారికి కరోనా సోకుతందేమోనని మౌనేష్ భయపడేవాడు. దానికి తోడు కరోనా వల్ల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో తన ఉద్యోగం కూడా పోతుందన్న భయం పట్టుకుంది. దాంతో ఏంచేయాలో తోచని మౌనేష్.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.

For More News..

కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదు

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్