
- బెంగళూరులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టు బాంబు బెదిరింపు మెయిల్స్ చేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్ కు చెందిన వైభవ్ తివారీ బెంగళూరులో ఉంటూ.. ఐటీ జాబ్ చేస్తున్నాడు. వైభవ్ తివారీ అనారోగ్యానికి గురై జాబ్ కోల్పోయాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్ చేశాడు.
ఈనెల 15న ఒక మెయిల్, 18న రెండో బెదిరింపు మెయిల్ చేయడంతో అప్రమత్తమైన శంషాబాద్ పోలీసులు బెంగళూరులో నిందితుడిని అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.