ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల వేడి జోరందుకుంటున్నవేళ.. నాయకులు ప్రత్యర్థులపై నోరుపారేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. కొందరు నేతలైతే మహిళల డ్రస్సింగ్, మేకప్ లాంటి అంశాలపైనా కామెంట్స్ చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. ఇలాంటిచిల్లర కామెంట్లు చేస్తున్నది సామాన్య కార్యకర్తలో,ఛోటామోటా నాయకులో అనుకుంటే పొరపాటే.ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం హోదాలున్నవారూఈ లిస్ట్‌లో చేరిపోవడం విశేషం. వాళ్లు చేసినకామెంట్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఈమధ్యనే బీజేపీలో చేరిన సినీనటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత, సంబల్ జిల్లా చీఫ్ ఫిరోజ్‌ఖాన్ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “రాం పూర్ ప్రజలకు వినోదం పంచడానికి ఓడ్యాన్సర్ ఎంటర్ అయ్యారు.ఇక సాయంత్రాలు రామ్ పూర్ వీధులు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి” అని రామ్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జయప్రదను ఉద్దేశించిఆయన అన్నారు. రాం పూర్ కోసం అజంఖాన్ చాలా అభివృద్ధి పనులు చేశారన్న ఫిరోజ్ ఖాన్ జయప్రద తన స్టెప్పులతో ఓటర్లను తనవైపు తిప్పుకోకుండా ఉంటే చాలని కామెంట్ చేశారు. ఫిరోజ్అంతటితో ఆగలేదు. గూం డాలకు జయప్రద రక్షణకల్పిస్తూ పెద్ద ‘గుండీ’ అవుతున్నారని పార్టీ కార్యకర్తల సభలో వ్యాఖ్యానించారు. 2004, 2009లో రాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన జయప్రద ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తూ …ఎస్పీ అభ్యర్థి అజం ఖాన్ కుగట్టిపోటీ ఇస్తున్నారు. అజంఖాన్ ఓడిపోవడం ఖాయమని తెలిసే జయప్రదతో ఎస్పీ మైండ్ గేమ్స్ఆడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సురేంద్రసింగ్: సోనియా ఇటలీలో డాన్సర్
బైరియా బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. 60 ఏళ్లు ఉన్న మాయావతి ఫేషియల్ చేసుకుంటారని, జుట్టుకు కలర్ వేసుకుంటారని పర్సనల్ కామెంట్స్ చేశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీపై, హర్యానా కు చెందిన సింగర్ డాన్సర్ సప్నా ఛౌధురిపై చేసిన వ్యాఖ్యల్ని పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు సురేంద్రసింగ్‌ను ఆడుకున్నారు.‘‘రాహుల్ తల్లి (సోనియా గాంధీ) కూడా ఇటలీలో డ్యా న్సర్. ఆమెను రాహుల్ తండ్రి రాహుల్‌గాంధీసొంతం చేసుకున్నారు. రాహుల్ గాంధీ కూడా కుటుంబ సంప్రదాయాన్ని పాటించాలి. సప్నానుసొంతం చేసుకోవాలి’’ అని కామెంట్ చేశారు. అంతకుముందు రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీనీ టార్గెట్ చేసి సురేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను రావణాసురుడితోను, ప్రియాంకను శూర్పణఖతోనూ పోల్చారు.
ఒకప్పటిబద్ధశత్రువైన సమాజ్‌వాదిపార్టీతో చేతులు కలిపిమాయావతి ఆడాళ్ల పరువుతీస్తున్నారని విమర్శించారు.మహేశ్ శర్మ: పప్పూ, పప్పూకీ పప్పీగౌతమ్ బుద్ధనగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకను కించపరిచేలాకామెంట్ చేశారు. రాహుల్‌ను పప్పు అని, ప్రియాంకను పప్పూకీ పప్పీ అని అన్నారు. “ప్రధానమంత్రిని అవుతానని పప్పు అంటారు. మాయావతి, అఖిలేశ్ కూడా అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆలిస్ట్‌లో పుప్పూకీ పప్పీ చేరారు. ప్రియాంక ఈదేశం పుత్రిక కాదా? భవిష్యత్తులో ఇక్కడ ఉండదా?” అని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యానించారు.
ఫిరోజ్ ఖాన్ కు ఎన్ సీడబ్ల్ యూ నోటీసులు
జయప్రద మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిరోజ్‌ఖాన్‌కు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సీడబ్ల్ యూ) నోటీసులు జారీ చేసింది.
ఆయన చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. “ ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం , మహిళలను కించపరిచేలా చేసే ఈ కామెంట్స్‌ను సహించబోం. దీనిపై ఆయన కచ్చితంగా స్పందించాలి” అని ఎన్‌సీడబ్ల్ యూ సెక్రటరీ బర్నాలీ షోమీ అన్నారు.
ఇమ్రాన్ మసూద్.. మసూద్ అజర్ అల్లుడు: సీఎం యోగి
బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల కామెంట్స్ ఒక ఎత్తైతే..స్వయంగా యూపీ సీఎం, ఫైర్ బ్రాండ్ గా పేరున్న యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యర్థుల్ని తక్కువ చేసి మాట్లాడ్డం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. షహరాన్‌పూర్ ప్రచారసభలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్ అభ్యర్ధి ఇమ్రాన్ మసూద్‌పై తీవ్రమైన కామెంట్స్ చేశారు. కాం గ్రెస్ అభ్యర్థి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అల్లుడని వ్యాఖ్యానించారు. ‘‘మసూద్ అజర్‌లా టెర్రరిస్టుల భాష మాట్లా డే ఇమ్రాన్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించండి’’ అని బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్ తరపున ప్రచారంలో పాల్గొన్న యోగి మాట్లాడ్డం పెద్ద దుమారాన్ని లేపింది. ‘రాహుల్ గాంధీ పిరికివాడు, నపుంసకుడు’ అని పవర్ మినిస్టర్ శ్రీకాంత్ శర్మ చేసి ట్వీట్ అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటలయుద్ధం జరిగింది
