యాప్‌ మనీ .. ఎంతో ఈజీ

యాప్‌ మనీ .. ఎంతో ఈజీ

రమేష్‌ ప్రైవేటు ఉద్యోగి. శాలరీ వస్తున్నా సరిపోవడం లేదు. నెలఖారున అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇలా ప్రతినెలా డబ్బులకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఒకసారి బ్యాంకుకు వెళ్లి పర్సనల్ లోన్‌ కావాలని కోరాడు. బ్యాంకు ఎగ్జిక్యూటీవ్‌ అప్లికేషన్​ ప్రాసెస్ స్టార్ట్‌ చేసి వారం తర్వాత చేదు కబురు చల్లగా చెప్పాడు. ప్రొఫైల్ బాగాలేదు. లోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చాడు. చేసేది లేక రోజూవారీ వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. అప్పులపై అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది.

******

బాలు సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్.. నెలకు వచ్చే శాలరీలోంచి ఫ్రెండ్స్‌ వద్ద తీసుకున్న అప్పులకే సగం చెల్లిస్తుంటాడు. అయితే అతనికి వచ్చే జీతానికి చాలా బ్యాంకులు లోన్‌ ఆఫర్లు చేస్తున్నా యి. ఒక బ్యాంకును మించి మరో బ్యాంకు ఎక్కువ మొత్తం లో రుణాలు ఇస్తా మని ఆఫర్లు ఇస్తున్నాయి.

హైదరాబాద్, వెలుగు :   పర్సనల్​లోన్‌ కావాలంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్​ ఉంటే చాలు. ఈజీగా ఇన్​స్టంట్ లోన్​ తీసుకోవచ్చు. ఇందుకు పలు కంపెనీల యాప్స్​అందుబాటులో ఉన్నాయి. రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. 10  నిమిషాల నుంచి అరగంటలోపే అకౌంట్​లోకి మనీ ట్రాన్స్​ఫర్ ​అవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు వేలల్లో  పర్సనల్​ లోన్‌ ఇస్తుండడంతో పాటు యూజర్స్​ సంఖ్యను పెంచుకుంటున్నాయి.  ఆధార్​.. పాన్​ వివరాలు తీసుకొని చెక్​ చేసి రుణాలు ఇస్తున్నాయి.

సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాన్​బ్యాంకింగ్ ఫైనాన్స్​ కంపెనీలు యాప్​ల ద్వారా లోన్‌లు మం జూరు చేస్తున్నాయి. ఇందుకు వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తే ట్రాక్​ రికార్డును బట్టి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.  కొన్ని కంపెనీలు ఇచ్చిన లోన్​ను నెలలోపే కట్టాల్సి ఉంటుంది. మరికొన్ని కంపెనీలు ఈఎంఐ కింద ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకుంటున్నాయి.  సిటీలో చాలావరకు జనాలు ప్లే స్టోర్​లోని మనీ యాప్​ ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. సాధారణ ఉద్యోగులకు మనీ యాప్స్​ భరోసాగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో సిటీల్లో మనీ యాప్స్​కు చాలా మంది యూజర్స్​ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. జంటనగరాల్లో చాలా వరకు మొబైల్​ షాపుల, వివిధ సెంటర్లలో ప్రత్యేకంగా మనీ యాప్స్​ రుణాల కంపెనీలు కౌంటర్లు ఆరంభించాయి. అంతేకాకుండా నగర సెంటర్లలో యాప్​ కంపెనీల ప్రమోటర్ల ద్వారా రుణాల మంజూరు ఇస్తున్నాయి.  బడా వ్యాపారుల నుంచి మిడిల్​క్లాస్​ వారు సైతం ఈజీ మనీ యాప్స్​ పట్ల ఆకర్షితులవుతున్నారు. బ్యాంకులలో మాదిరి ఎలాంటి   డాక్యుమెంటేషన్, సాక్షి సంతకాలు లేకున్నా సులువుగా లోను లభిస్తుండడంతో మనీ యాప్స్​ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. ​

రిజిస్ట్రేషన్​తో లాగిన్​

మొబైల్‌ ఫోన్​లోని ప్లేస్టోర్​ నుంచి కావాల్సిన మనీ యాప్​ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫోన్​ నెంబర్‌తో  రిజిస్ట్రేషన్ లాగిన్‌ కావాలి. పాన్‌​, ఆధార్‌తో పాటు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఎంత లోన్​ కావాలనుకుంటున్నారు? ఈఎంఐ, చెల్లింపు పద్ధ తి అన్ని డిస్​ప్లే అవుతాయి. అన్నీ సక్సెస్​ అయితే నేరుగా ఖాతాలో డబ్బులు పడిపోతాయి. కొన్ని కంపెనీలు మాత్రం వివరాలు నమోదు చేసే సమయంలో ఆలస్యం కానీ, ఇతర కారణాలతో అవాంతరాలు వస్తే ఆన్​లైన్​కు బదులు ఆఫ్​లైన్​కు వెళ్లి ఇంటి అడ్రస్​కు ప్రమోటర్లు వస్తారు. చెక్‌ చేసుకున్న తర్వాతే ఖాతాలో డబ్బులు జమా అయ్యేలా చూస్తారు. చాలావరకు ఆన్​లైన్​ ద్వారానే చెల్లిస్తున్నామని ప్రముఖ మనీ యాప్​ కంపెనీ మేనేజర్​ పేర్కొన్నాడు. చిన్నవి, పెద్దవి కలిపి 21 యాప్​ కం పెనీలు ఇన్​స్టంట్​ లోన్‌లు ఆఫర్‌ చేస్తున్నాయి.

సిబిల్ ​స్కోరు లేకుంటే..

దాదాపుగా సిబిల్​ స్కోరు ఆధారంగానే లోన్‌లను వెంటనే మంజూరు చేస్తున్నాయి. చాలామందికి సిబిల్ స్కోరు తక్కువగా ఉండడంతో లోన్‌లు రిజెక్ట్‌ అవుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం సిబిల్​లేకపోయినా బ్యాంకు ట్రాక్​ రికార్డు ఆధారంగా లోన్లు ఇస్తున్నాయి. ఒకసారి లోన్​ పొందితే మరోసారి రెట్టింపు రుణం అందించే అవకాశం కల్పిస్తున్నాయి.

ప్రాసెసింగ్ ఫీ కట్‌ చేసుకొనే..

డాక్యుమెంటెషన్, జీఎస్టీ, ఫీ మొత్తంగా ప్రాసెసింగ్‌ కింద ముందే మనీ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇన్​స్టాల్​మెంట్ల వారీగా డబ్బులు చెల్లిస్తే దానిపైనా వడ్డీ వసూలు చేస్తారు.