గ్రహణం ఎఫెక్ట్.. నిటారుగా నిలబడిన రోకలి

గ్రహణం ఎఫెక్ట్.. నిటారుగా నిలబడిన రోకలి

జనరేషన్ మారినా పురాతన పద్దతులు చాలా గ్రామాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యగ్రహణం రోజున ఈ విషయం మరోసారి రుజువైంది. గ్రహణం సమయంలో తాంబాలంలో నీళ్లు పోసి రోకలి నిలబెట్టే పద్దతిని ఫాలో అవుతున్నారు గ్రామస్థులు. ఇవాళ సూర్యగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది.  గ్రామస్థులు తాంబాలంలో పసుపు నీళ్లు పోసి రోకలిని నిలబెట్టారు. కొంత సేపు ఆ రోకలి అలాగే నిటారుగా ఉంది.   గ్రహణం అయిపోయే వరకు ఏ సహాయం లేకుండా రోకలి నిలబడుతుందన్నది వారి నమ్మకం. పురాతన కాలంలో గ్రహణంను  ఇలానే పరీక్షించేవారంటున్నారు గ్రామస్థులు.