
విద్యా శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు గురుకుల పీఈటీ సెలెక్టెడ్ అభ్యర్థులు. మహిళా అభ్యర్థులు చంటి పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలన్న సీఎం కేసీఆర్ ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకానప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. సీఎం కేసీఆర్ తన కుటుంబంలో నలుగురి గురించే ఆలోచిస్తున్నారని అభ్యర్థులు విమర్శించారు. కుటుంబ సభ్యులను రాష్ట్ర, కేంద్రంలో ఎక్కడ సెట్ చేయాలని ప్లాన్లు వేస్తున్నారన్నారు. మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అభ్యర్థులు విమర్శించారు. మేం మీ బిడ్డలం కాదా ? అంటూ ప్రశ్నించారు. నెల రోజుల్లో తమకు ఉద్యోగాలు ఇవ్వకుంటే.. ఫామ్ హౌస్ ని ముట్టడిస్తామన్నారు. చావో, రేవో తేల్చుకుంటామన్నారు.