
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఇండియన్ సిటిజన్‌షిప్ రాకముందే ఓటర్ లిస్టులో పేరు నమోదైందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ‘‘సోనియాకు 1983లో సిటిజన్‌షిప్ వచ్చింది. కానీ 1980లోనే ఢిల్లీ ఓటర్ లిస్టులో ఆమె పేరు ఉంది. అయితే 1982లో సోనియా పేరును డిలీట్ చేశారు.
సిటిజన్‌షిప్ పొందాక 1983లో రీఎంటర్ చేశారు. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ల ఫోర్జరీ జరిగింది. దీనిపై పోలీస్ ఎంక్వైరీకి ఆదేశించండి” అని వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే దీన్ని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా కొట్టివేశారు.