శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవే : హైకోర్టు

 శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవే :  హైకోర్టు

 శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.   ఆ భూములు హెచ్‌ఎండీఏవేనని తెలిపింది.  పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు.. వాళ్ల తీరును తప్పుబడుతూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు  కొందరు ప్రయత్నించారు. సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని హెచ్‌ఎండీఏ వాదించింది. ఇరువైపులా వాదనలు నవంబర్‌ 18వ తేదీన పూర్తికాగా.. తీర్పును రిజర్వ్‌ చేసింది డివిజన్‌ బెంచ్‌. 

రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండిఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు.     

వాద ప్రతి వాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18 వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పు ను గురువారం (14వ తేదీన) గౌరవ హైకోర్టు వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు  వెల్లడించింది.