స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలి..హైకోర్టులో పిటిషన్ దాఖలు

స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలి..హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థలకుఎన్నికలు వెంటనే నిర్వహించాలని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెంగ్రామానికి దిన రెంక సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదని, కేవలం 42 % రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలపై మాత్రమే స్టే విధించిందని పిటిషనర్ తరఫు అడ్వకేట్ నలిమెల వెంకటయ్య పేర్కొన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, 50% రిజర్వేషన్లు మించకుండా ముందుకు వెళ్లాలని  రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఇప్పటికే సూచించినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నిలిపివేసిందని తెలిపారు. రెండేండ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల్లో పాలన మరుగున పడిందన్నారు.