ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో పిటిషన్

ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో పిటిషన్

ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఉస్మానియా విద్యార్థి సుదేంద్ర సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీ నెరవెర్చకపోవడమే సమ్మెకు కారణమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడం సహా కార్మికుల డిమాండ్లను నెరవెర్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.

హౌస్ మోషన్ పిటిషన్ పై నాలుగు గంటలకు వాదనలు విననున్నారు హై కోర్టు న్యాయమూర్తి. కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి బంగ్లాలో ఈ వాదనలు జరగనున్నాయి.