గణేష్ నిమజ్జనాన్ని నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్

గణేష్ నిమజ్జనాన్ని నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోగణేష్ నిమజ్జనం నిషేధించాలన్న పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదని.. పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఏడాది గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ...అంతేకాదు నిమజ్జనానికి కూడా అనుమతి ఇవ్వరాదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ విషయ లో ప్రభుత్వ నిర్ణయాన్ని రేపటి లోగా తెలియ చేస్తామని ప్రభుత్వ  ప్రత్యేక న్యాయవాది హరిందేర్ సింఘ్  తెలియ జేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 11కి వాయిదా వేసింది హైకోర్టు.

2011 లో పిటిషనర్ మామిడి వేణు మాధవ్ వేసిన కేసును ముగిస్తూ.. ఈ కేసు లోని ఉత్తర్వులు అమలు కానందుకు వేసిన కోర్టు దిక్కర పిటిషన్ చెల్లు బాటు అవుతుందని, దిక్కార పిటిషన్ పై ఇక ముందు విచారణ ఉంటుంది అని బెంచ్ తెలియచేశారు. 2001 లో అప్పటి  చీఫ్ జస్టిస్ బెంచ్ ఎస్ బి సీన్ హ, ఎస్ ఆర్ నాయక్ ఇచ్చిన  ఉత్తర్వులను తప్పకుండ అమలను కోరుతూ పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇంతవరకు హుస్సేన్ సాగర్ నీటిని శుద్ది చేయడం జరగలేదని, మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్ధాలు కలవకుండ ఆపలేక పోయారని, కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కారని తెలిపారు. ఒక ఏడాది కాలం లో మురుగు, వ్యర్ధాలు కలవకుండ తగిన చర్యలు తీసుకోవాలని గతంలో చీఫ్ జస్టిస్ ఎస్ బి సీన్ హ బెంచ్ తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.