కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : బీఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : బీఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రం
  • మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేత

సిద్దిపేట, వెలుగు: భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రం కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలసి ప్రమాదవశాత్తు మరణించిన  కార్మికులకు రూ. 10 లక్షలు,  సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.3 లక్షలు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పరిహారం ప్రభుత్వం నుంచి కానీ వెల్ఫేర్ బోర్డు నుంచైనా ఇవ్వాలని మంత్రిని కోరారు. ఆయన వెంట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెలిమిల రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి గంగాధర్ ఉన్నారు.