పెట్రోల్‎పై 29 రోజుల్లో 6.75 పైసల వడ్డన 

పెట్రోల్‎పై 29 రోజుల్లో 6.75 పైసల వడ్డన 

పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.  ఇవాళ మరోసారి ఇంధన ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్‎పై 35 పైసలు, డీజిల్‎పై 35 పైసలు పెంచాయి. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.36 పైసలకు చేరగా.. డీజిల్ ధర రూ. 106.60 పైసలకు చేరింది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109 రూపాయల 34 పైసలకు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 98 రూపాయల 7 పైసలకు చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలు దాటింది. ముంబైలో  లీటర్ డీజిల్ ధర 106 రూపాయల 23 పైసలకు ఎగబాకింది. అన్ని మెట్రో నగరాలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు ముంబైలో అధికంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ బాలఘాట్‎లో లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలు దాటగా.. లీటర్ డీజిల్ ధర 110కి చేరువైంది. కాగా.. ఆయిల్ కంపెనీలు గత 29 రోజుల్లో 22 సార్లు పెట్రో ధరలు పెంచాయి. దీంతో పెట్రోల్‎పై ఏకంగా 6 రూపాయల 75 పైసలు పెరిగింది.