దేశంలో కొనసాగుతున్న పెట్రో ధరల మంట

V6 Velugu Posted on Oct 15, 2021

దేశంలో పెట్రో ధరల మంట కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 109 రూపాయల 37 పైసలకు, డీజిల్ ధర 102 రూపాయల 42 పైసలకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 105 రూపాయల 14 పైసలకు, డీజిల్ 93 రూపాయల 87 పైసలకు చేరింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ 105 రూపాయల 76 పైసలకు, డీజిల్ 96 రూపాయల 98 పైసలకు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 111 రూపాయల 9 పైసలకు, డీజిల్ 101 రూపాయల 78 పైసలకు పెరిగింది.

ఈ నెలలో ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే 12, 13 తేదీల్లో ధరలు పెంచలేదు ఆయిల్ కంపెనీలు. అంతకుముందు వారం రోజుల పాటు వరుసగా పెట్రోల్ ధరలు పెరిగాయి. నిన్న, ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశంలో ముంబైలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. 

Tagged India, business, petrol, prices,

Latest Videos

Subscribe Now

More News