
దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతోంది.. వరుసగా నాలుగో రోజు చమురు ధరలు పెరిగాయి.. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ లో 106.47 రూపాయలకు చేరుకోగా.. డీజిల్ ధర 99.42 రూపాయలకు చేరింది. పెట్రో ధరలు పెరగడంతో సామాన్యులపై భారీగా భారం పడనుంది. ఆయిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగే ఛాన్సుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.