నెల రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్ ధరలు

నెల రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్ ధరలు

దాదాపు నెల రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై రేట్లు స్వల్పంగా తగ్గించాయి. దాంతో లీటర్ పెట్రోల్ పై 14 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గింది. చమురు కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 105 రూపాయల 69 పైసలు కాగా, డీజిల్ 97 రూపాయల 15 పైసలకు చేరింది. జులై 18 నుంచి ఆయిల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 41 సార్లు పెట్రో రేట్లు పెరిగాయి. జూన్, జూలై నెలల్లో ఏకంగా రోజు తప్పి రోజు.. ధరలు పెరుగుతూ వచ్చాయి. ఓవర్ ఆల్ గా ఈ ఏడాది లీటర్ పెట్రోల్ మీద 11 రూపాయల 44 పైసలు, డీజిల్ మీద 8 రూపాయల 74 పైసలు పెరిగింది.