ఇవాళ్టి పెట్రో ధరలివే: 30 రోజుల్లో 23 సార్లు

ఇవాళ్టి పెట్రో ధరలివే: 30 రోజుల్లో 23 సార్లు

పెట్రో ధరల మంట కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్ లో పెట్రోల్ పై 41 పైసలు, డీజిల్ పై 42 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 13 పైసలు, డీజిల్ 107 రూపాయల 40 పైసలకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెరిగింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 109 రూపాయల 69 పైసలకు, డీజిల్ 98 రూపాయల 42 పైసలకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 106 రూపాయల 35 పైసలకు, డీజిల్ 102 రూపాయల 59 పైసలకు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 15 పైసలకు, డీజిల్ 101 రూపాయల 56 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 115 రూపాయల 50 పైసలు, డీజిల్ 106 రూపాయల 62 పైసలకు పెరిగింది. రోజువారీ సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. మధ్యప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ 120 రూపాయలు దాటింది. రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.