
పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకు ఆకాశన్నంటుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధర వివిధ నగరాల్లో 30 పైసల నుంచి 51 పైసలు వరకు పెరిగింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా 36 పైసల నుంచి 60 పైసల మధ్య పెరిగింది. శనివారం పెరిగిన రేట్లతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 96 పైసలకు చేరింది. డీజిల్ ధర 85 రూపాయల 89 పైసలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు 88 రూపాయల 44 పైసలకు చేరింది. డీజిల్ ధర కూడా 78 రూపాయల 74 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 94.66 పైసలు, డీజిల్ ధర 84.15 పైసలకు చేరింది. వరుసగా చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
For More News..