వారం తర్వాత ఆగిన పెట్రో రేట్ల పెరుగుదల

వారం తర్వాత ఆగిన పెట్రో రేట్ల పెరుగుదల

వరుసగా వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరల స్పీడ్‌కు మంగళవారం బ్రేకులు పడ్డాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏ మార్పులు లేకుండా స్థిరంగా ఉంచాయి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు. సోమవారం పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.108.64, పెట్రోల్‌ ధర రూ.101.66గా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.14, డీజిల్ ధర రూ.93.17కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.110 మార్క్‌ దాటి.. రూ.110.41కు పెరిగింది. డీజిల్ ధర రూ.101.03కు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ రూ.101.79, డీజిల్ రూ.97.59గా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.105.09, డీజిల్ రూ.96.28కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రో ధరలను రోజువారీగా పెంపు లేదా తగ్గింపు చేసుకునే అవకాశాన్ని 2017 నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో నాటి నుంచి రోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రో రేట్ల అప్‌డేట్‌ను కంపెనీలు ప్రకటిస్తూ వస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

టాలీవుడ్‌లో చీలిక.. కొత్త అసోసియేషన్ ‘ఆత్మ’?

ఎయిర్‌‌పోర్టులోకి భారీ వరద.. ప్రయాణికులను ట్రాక్టర్‌‌లో తరలింపు

దేశంలో రెండేళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్