ఎయిర్‌‌పోర్టులోకి భారీ వరద.. ప్రయాణికులను ట్రాక్టర్‌‌లో తరలింపు

ఎయిర్‌‌పోర్టులోకి భారీ వరద.. ప్రయాణికులను ట్రాక్టర్‌‌లో తరలింపు

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి బెంగళూరులో కుండపోత వాన కురిసింది. భారీ వర్షంతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. కెంపేగౌడ అంతర్జాతీయ  విమానాశ్రయం పూర్తిగా జలమయమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్‌‌పోర్టు ఎదురుగా భారీగా వరద నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కార్లు ఉన్నవారు కొంత సాఫీగా వెళ్లిపోయినప్పటికీ.. సొంత వాహనాలు లేనివారు వెళ్లడానికి ఇబ్బందులు పడుతుండడంతో వారిని ట్రాక్టర్‌‌లో బయటకు తరలించారు.

మరోవైపు  ఇవాళ బెంగళూరులో ఉరుములు,  మెరుపులతో కూడిన  వాన పడే  అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. అటు తుమకూర,  శివమొగ్గ,  చిక్కబల్లపుర,  చిక్కమగళూరుకు ....ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు దక్షిణ  కన్నడ, ఉడిపి,  ఉత్తర కన్నడలో ...రేపు, ఎల్లుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం  ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం..

భార్య ఆస్తి కొట్టేయాలని త్రాచుపాముతో కాటేయించాడు

టాలీవుడ్ విషాదం.. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడి మృతి

వైఎస్‌ను కించపరిస్తే.. అభిమానులు కేసీఆర్ భరతం పడ్తరు: షర్మిల