టాలీవుడ్ నిర్మాత మహేశ్​ కోనేరు కన్నుమూత

V6 Velugu Posted on Oct 12, 2021

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్​ కోనేరు కన్నుమూశారు. విశాఖలో ఇవాళ ఉదయం గుండెపోటుతో  మృతి చెందారు.  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు మహేశ్ పీఆర్ గా పనిచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో  కళ్యాణ్ రామ్ తో నా నువ్వే సినిమాతో నిర్మాతగా మారాడు.  118,మిస్ ఇండియా,తిమ్మరుసు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. మహేశ్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సానూభూతి తెలిపారు. తన ఆప్తమిత్రుడు మహేశ్ కోనేరు లేరన్న వార్తతో షాక్ కు గురయ్యానన్నారు.  తనకు మాటలు రావడం లేదంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

 

Tagged tollywood producer, Mahesh Koneru passed away, ntr, kalyanram pr

Latest Videos

Subscribe Now

More News