సామాన్యుడిపై పెట్రో బాదుడు

సామాన్యుడిపై  పెట్రో బాదుడు

దేశంలో ఒక రోజు విరామం తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పై 80 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. న్యూఢిల్లీలో పెట్రోల్ 102 రూపాయల 61 పైసలకు చేరింది. డీజిల్ 93 రూపాయల 87 పైసలకు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ 116 రూపాయల 32 పైసలకు చేరింది. డీజిల్ 102 రూపాయల 45 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 117 రూపాయల 57 పైసలకు చేరింది. డీజిల్ 101 రూపాయల 79 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ 108 రూపాయల 21 పైసలకు చేరింది. కోల్ కతాలో పెట్రోల్ 112 రూపాయల 19 పైసలకు, డీజిల్ 97 రూపాయల 2 పైసలకు పెరిగింది. 

మార్చి 22 నుంచి పెట్రోల్ ధర ఇప్పటివరకు 7 రూపాయల 20 పైసలు పెరిగింది. గత ఏడాది నవంబర్ 3న కేంద్రం పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది. దీని ప్రకారం కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. అయితే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించలేదు. ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అందుకే రేట్లు పెంచుతామంటున్నాయి  ఆయిల్ కంపెనీలు.