బండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినయ్‌‌: నిరుటి కంటే 49,146 ఎక్కువ

బండ్ల రిజిస్ట్రేషన్లు  పెరిగినయ్‌‌: నిరుటి కంటే 49,146 ఎక్కువ

కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 49,146 ఎక్కువ వెహికల్స్​రిజిస్టర్‌‌ అయ్యాయి. డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లు తీసుకున్నోళ్లు కూడా బాగానే పెరిగారు. 2019 ఏప్రిల్​నుంచి డిసెంబర్‌‌ వరకు 9 నెలల్లో 10,78,171 బండ్లు రిజిస్ట్రేషన్​ కాగా 8,11,851 మోటార్‌‌ సైకిళ్లు, 1,26,888 కార్లు ఉన్నాయి. 2018 ఇదే  పీరియడ్​లో 10,29,025 వాహనాలు రిజిస్టర్‌‌ అయ్యాయని, ఇందులో 7,72,995 టూవీలర్లు, 1,18,084 కార్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

‘చదువు’ రూల్ ఎత్తివేతతో..

గతేడాది 4,54,717 డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లు నమోదు కాగా ఈ సారి 5,21,685 మంది లైసెన్స్‌‌లు తీసుకున్నారు.

అప్పుడు లైసెన్స్‌‌ తీసుకోవాలంటే 8వ తరగతి పాసై ఉండాలన్న రూల్​ఉండేది కానీ దీన్ని సడలించి చదువుకోకపోయినా లైసెన్స్​ఇవ్వొచ్చనే నిబంధనతో లైసెన్స్​లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. నిరుడుతో పోలిస్తే 66,968 మంది ఎక్కువగా లైసెన్స్‌‌లు తీసుకున్నారు.

ఆర్టీఏకు స్వల్పంగా పెరిగిన ఇన్​కం 

వెహికల్స్ అమ్మకాలు తగ్గినప్పటికీ గతంతో పోలిస్తే ఆర్టీఏ ఇన్​కం ఈసారి కొంచెం పెరిగింది. సాధారణంగా లైఫ్‌‌ట్యాక్స్‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌, యూజర్‌‌ చార్జీలు, ఇతర విభాగాల నుంచి ఆర్టీఏకు ఆదాయం వస్తుంటుంది. 2018 ఏప్రిల్​నుంచి డిసెంబర్​ వరకు 2,638 కోట్లు రాగా, మొత్తంగా 2018–19 ఫైనాన్షియల్​ఇయర్​లో ఖాజానాలో 3,504 కోట్లు జమయ్యాయి. ఇక 2019 ఏప్రిల్‌‌ నుంచి డిసెంబర్‌‌ నెల వరకే 2,712.5 కోట్లు వచ్చాయని, రెండు శాతం గ్రోత్‌‌ రేట్‌‌ నమోదైందని అధికారులు చెప్పారు. వచ్చే మార్చిలోపు  తాము పెట్టుకున్న 3,714 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.