
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో చాలా ఏళ్లకు లీటరు పెట్రోల్ ధర తొలిసారిగా రూ.75కు చేరింది. లీటరు పెట్రోల్‌పై ఐదు పైసలు, డీజిల్‌పై పది పైసలు పెంచినట్టు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. గత నెల తొమ్మిది నుంచి ఒక్క రోజు తప్ప మిగతా రోజుల్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నవంబరు తొమ్మిది నుంచి సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ.2.30 పెంచారు. డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.80కు, డీజిల్ ధర రూ.68.44కు చేరింది.