
పెట్రోల్, డీజిల్ ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 36 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 111 రూపాయల 91 పైసలకు చేరింది. డీజిల్ ధర 105 రూపాయల 8 పైసలకు చేరుకుంది. గత సంవత్సర కాలంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్ లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్టానికి చేరినా.. మన దేశంలో తగ్గడం లేదు. 18 నెలల కాలంలో లీటర్ పెట్రోల్ పై 35 రూపాయలు పెరిగింది. డీజిల్ 26 రూపాయలు పెరిగింది.