
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని జూలై 14లోగా ఖాతాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25శాతంగా గా నిర్ణయించారు.
సాధారణంగా ఈపీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ పూర్తి కావడానికి ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు సమయం పడుతుంది. అయితే ఈ యేడాది సిస్టమ్ ఆప్టిమైజేషన్ కారణంగా ప్రక్రియ వేగవంతం చేశారు. జూలై 8 నాటికి మొత్తం 13.88 లక్షల సంస్థలకు చెందిన 33.56 కోట్ల ఖాతాలలో దాదాపు 96.51 శాతం అనగా 32.39 కోట్ల ఖాతాలకు వడ్డీ జమ చేశారు. మిగిలిన ఖాతాలకు వడ్డీ జమ ప్రక్రియ ఈ వారంలోగా పూర్తి అవుతుందని మాండవియా చెప్పారు.
మీ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో ఎలా తనిఖీ చేయాలి..
EPFO పోర్టల్ ద్వారా మీ UAN నంబర్ , పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి, మీ పాస్‌బుక్‌ను తనిఖీ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా View Passbook ఆప్షన్ ఉపయోగించి బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.
►ALSO READ | HCA స్కాంలో రూ. 170 కోట్ల గోల్ మాల్ జరిగింది
మీ UAN తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ సమాచారం పొందవచ్చు.
కొన్నిసార్లు వడ్డీ జమ అయినప్పటికీ అది పాస్‌బుక్‌లో కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ వడ్డీ జమ కాకపోతే ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ పోర్టల్ (EPFiGMS) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.